రేపటి నుంచి ఇక్ఫాయ్‌లో మోడల్ కాన్ఫరెన్స్
శంకర్‌పల్లి: ఇక్ఫాయ్ డీమ్డ్ వర్సిటీలో లా స్కూల్ ఆధ్వర్యంలో ‘మోడల్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్’కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ రాకేశ్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7,8,9న నిర్వహించనున్న ఈ కాన్ఫరెన్స్‌ను మర్రి శశిధర్‌రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు. విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు దేవేందర్
షాబాద్: మిషన్ భగీరథ కార్మికుల పెండింగ్‌లో వేతనాలను వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అల్లి దేవేందర్ డిమాండ్ చేశారు. షాబాద్ బీపీటీ వద్ద మిషన్ భగీరథ కార్మికులు బుధవారం విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2018 నుంచి మిషన్ భగీరథ కార్మికులు విధులు నిర్వహిస్తున్నా ఇప్పటి వరకు వేతనాలు పెంచలేదన్నారు. ఈఎస్‌ఐ, పీఎఫ్, వారాంతపు సెలవులు ఇవ్వకుండా రోజుకు 12 గంటలు పనిచేయించుకుంటూ శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని మండిపాడ్డారు. ప్రభుత్వం స్పందించి వేతనాలు పెంచడంతో పాటు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి
మహేశ్వరం: భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందజేసి ఆదుకోవాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆమె మండల పరిధిలోని కేసీ తండా కేజీబీవీ హాస్టల్, మహేశ్వరం మోడల్ స్కూల్ హాస్టల్ గదులను, రామచంద్రగూడ గ్రామంలో దెబ్బతిన్న పంటలను సందర్శించారు. ఈ సందర్బంగా సబితారెడ్డి మాట్లాడుతూ.. మంగళవారం కురిసిన భారీ వర్షానికి హాస్టల్ గదుల్లోకి నీరు చేరిందన్నారు. రామంచంద్రగూడలోని కోటిరెడ్డికుంట అలుగు పారవడంతో గ్రామంలో ఇళ్ల మధ్య నుంచి భారీగా వరద పారిందన్నారు. హాస్టల్ గదుల్లో చేరిన వరద నీటిని వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఆమె వెంట పీఏసీఎస్ చైర్మన్ పాండు యాదవ్, వైస్ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు అంబయ్య యాదవ్, చంద్రయ్య, మోతీలాల్ నాయక్, రాజు నాయక్ తదితరులు ఉన్నారు.
ఈ నెల 14 వరకు టెండర్ల ఆహ్వానం
యాచారం: ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో భాగంగా నక్కర్తమేడిపల్లిలో లైఫ్ సైన్సెస్ హబ్ ఏర్పాటుకు సర్కార్ సంకల్పించింది. ఈ నిర్మాణ పనులకు గాను రూ.24 కోట్ల నిధులతో ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. ఈ పనులకు గాను తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ విడుదల చేసిన ఈ–ప్రొక్యూర్‌మెంట్ టెండర్ నోటీసుల్లో ఈ నెల 14వ తేదీ వరకు అవకాశం కల్పించారు. హెచ్‌జీపీసీ( హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ) లేఅవుట్‌కు చేరువగా ఉండటానికి ప్రస్తుతం ఉన్న గ్రామ బీటీ రోడ్లను 50 నుంచి వంద అడుగుల వరకు విస్తరించనున్నారు. నాగార్జునసాగర్–హైదరాబాద్ రహదారిపై ఉన్న తక్కళ్లపల్లి గేట్ బస్టాప్ నుంచి గ్రామం మీదుగా నక్కర్తమేడిపల్లి సమీపంలోని హెచ్‌జీపీసీ సరిహద్దు వరకు రోడ్డును విస్తరించనున్నారు. ఈ రోడ్డు నిర్మాణ పనులకు నెల క్రితమే రెవెన్యూ, టీజీఐఐసీ ఉన్నతాధికారుల బృందం సర్వే సైతం పూర్తి చేసింది. నక్కర్తమేడిపల్లి రెవెన్యూ పరిధిలో దాదాపు 50 నుంచి వంద ఎకరాల విస్తీర్ణంలో లైఫ్ సైన్సెస్ హబ్ ఏర్పాటు చేసే ప్రతిపాదిత స్థలం వరకు అంతర్గత రహదారుల నిర్మాణానికి సర్కార్ నిర్ణయించినట్లు టీజీఐఐసీకి చెందిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో తెలిపారు.
రేపటి నుంచి ఇక్ఫాయ్‌లో మోడల్ కాన్ఫరెన్స్
రేపటి నుంచి ఇక్ఫాయ్‌లో మోడల్ కాన్ఫరెన్స్


