
డీసీసీ అధ్యక్ష పదవికి గూడూరు దరఖాస్తు
కడ్తాల్: డీసీసీ అధ్యక్ష పదవి కోసం డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్‌రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు గురువారం ఆయన టీయూఎఫ్‌ఐడీసీ చైర్మన్, డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డికి దరఖాస్తు సమర్పించారు. 25 ఏళ్లుగా పార్టీకి సేవలందిస్తున్నాని.. కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఐఎన్‌టీయూసీల్లో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పదవులు చేపట్టి పార్టీ బలోపేతానికి కృషి చేశానని గుర్తు చేశారు. విద్యార్థి దశ నుంచి ఒకే జెండా కింద పనిచేస్తున్న తనకు అవకాశం కల్పించాలని కోరారు. ఆయన వెంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీపాతి శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.