
భర్త మృతిని తట్టుకోలేక..
దశదినకర్మలోపే భార్య మృతి
అబ్దుల్లాపూర్‌మెట్: భర్త దశదిన కర్మ రోజే భార్య అంత్యక్రియలు నిర్వహించిన విషాద ఘటన అబ్దుల్లాపూర్‌మెట్‌లో గురువారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. అబ్దుల్లాపూర్‌మెట్‌లో నివాసముంటున్న సీనియర్ జర్నలిస్ట్ మేడపాటి బాబ్జీ(62) ఈనెల 5న గుండెపోటుతో చనిపోయారు. భర్త మరణాన్ని తట్టుకోలేకపోయిన జయప్రద(58) మనోవేదనతో అస్వస్థతకు గురైంది. ఈక్రమంలో ఆమెను ఆస్పత్రిలో చేర్పించగా 14న చనిపోయింది. తెల్లవారితే తండ్రి దశదినకర్మ చేయాల్సిన పిల్లలు తల్లి అంత్యక్రియలు నిర్వహించారు. సీనియర్ జర్నలిస్ట్ మామిడి సోమయ్య తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.