
పదవుల్లో కీలకం
అభివృద్ధికి సహకారం ఆలయాల అభివృద్ధికి ఆర్థిక సహకరిస్తామని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి అన్నారు.
యాచారం: రాష్ట్రాన్ని శాసించే కీలక పదవుల్లో ఇబ్రహీంపట్నం ప్రాంత వాసులు కొనసాగుతున్నారు. అంతా వ్యవసాయ, రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారే కావడం విశేషం. అంచలంచెలుగా ఎదిగి ప్రస్తుతం ఉన్నత హోదాలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అటు రాష్ట్ర సేవలో తలమునకలవుతూనే ఇటు వీలుచిక్కినప్పుడలా పుట్టిన గడ్డకు తోడ్పాటునందిస్తూ ముందుకు సాగుతున్నారు. కీలక పదవుల్లో ఉన్న తమ ప్రాంత వాసులను చూసి స్థానికులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
డీజీపీగా శివధర్‌రెడ్డి
ఇబ్రహీంపట్నం మండలం పెద్దతుల్ల గ్రామానికి చెందిన బత్తుల శివధర్‌రెడ్డి డీజీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కొన్నేళ్లుగా పోలీస్ శాఖలో పలు కీలక పోస్టుల్లో పనిచేసి పదవికే వన్నె తెచ్చిన ఆయన సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్‌లో కీలకమైన పోలీస్ బాస్‌గా బాధ్యతలు చేపట్టారు. వ్యవసాయ, రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన కష్టపడి చదివి ఐపీఎస్‌గా ఎంపికై ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు ఎస్పీగా, ఇంటెలిజెన్స్ బాస్‌గా విధులు నిర్వర్తించారు. పోలీస్ బాస్‌గా సేవలందిస్తూ ఇబ్రహీంపట్నం నియోజవర్గం ప్రజలు ఎక్కడ కనిపించినా ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకుంటారు. యువత కనిపిస్తే కష్టపడి చదవాలి.. ఉన్నత ఉద్యోగాలు సాధించి పుట్టినగడ్డకు మంచి పేరు తేవాలని హితబోధ చేస్తూ.. వారిలో స్ఫూర్తిని నింపుతుంటారు.
రైతు కమిషన్ చైర్మన్‌గా కోదండారెడ్డి
యాచారం మండల కేంద్రానికి చెందిన ముదిరెడ్డి కోదండరెడ్డి రైతు కుటుంబం నుంచి వచ్చినవారే. విద్యార్థి నేతగా, యువ నేతగా అంచెలంచెలుగా ఎదిగి నగరంలోని ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా, హూడా చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. తాజాగా వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్‌గా ఏడాదిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంజయ్య, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, రోశయ్య, డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తదితర సీఎంలతో సన్నిహితంగా మెలిగారు. ప్రస్తుతం ఫార్మాసిటీ రద్దు చేయించడం, భూభారతి చట్టం తీసుకురావడం, ఫ్యూచర్‌సిటీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. రైతుల భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించేలా పాటుపడుతున్నారు. ఇబ్రహీంపట్నం ప్రాంత రైతులు ఎక్కడ కనిపించినా వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు.
కాకతీయ వర్సిటీ వీసీగా ప్రతాప్‌రెడ్డి
యాచారం మండలం మొగుళ్లవంపు గ్రామానికి చెందిన కర్నాటి ప్రతాప్‌రెడ్డి కాకతీయ యూనివర్సిటికీ వైస్ చాన్సలర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వారే. యాచారం, మాడ్గుల మండల కేంద్రాల్లో పదో తరగతి వరకు విద్యాభ్యాసం చేసిన ఆయన ఉన్నత చదువుల కోసం నగరానికి వెళ్లి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నత పదవులు చేపట్టారు. ఉన్నత హోదాలో ఉన్నప్పటికీ వ్యవసాయంపై మక్కువను మాత్రం వదులుకోలేదు. సమయం చిక్కినప్పుడల్లా సాదాసీదాగా గ్రామానికి వస్తూ తన వ్యవసాయ పొలంలో పంటలను పరిశీలిస్తూ తోటి రైతులకు సూచనలు, సలహాలు అందిస్తున్నారు. యాచారం గ్రామస్తులు ఎక్కడ తారసపడినా యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటారు. వీసీగా వేలాది మంది యువతకు మార్గదర్శకుడిగా వారి ఉన్నతికి బాటలు వేస్తూ మనన్నలు పొందుతున్నారు.
పుట్టినగడ్డపై మమకారం
ఒకరు రాష్ట్రానికే పోలీస్ బాస్
ఇంకొకరు కాకతీయ వర్సిటీ వీసీ
మరొకరు వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్
మురిసిపోతున్న ‘పట్నం’ గడ్డ

పదవుల్లో కీలకం

పదవుల్లో కీలకం