
28 మద్యం దుకాణాలకు 308 టెండర్లు
అబ్దుల్లాపూర్‌మెట్: రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలకు ప్రభుత్వం నిర్వహిస్తున్న టెండర్ల ప్రక్రియలో భాగంగా హయత్‌నగర్ ఎకై ్సజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని 28 షాపులకు 308 దరఖాస్తులు వచ్చినట్లు ఎకై ్సజ్ సీఐ ధన్వంత్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఒక్క రోజే 86 అప్లికేషన్లు రాగా బండరావిరాలలో ఎస్టీ రిజర్వు అయిన దుకాణానికి ఒక్కటి కూడా రాలేదని చెప్పారు. ఈ నెల 18తో టెండర్ల ప్రక్రియ ముగియనుందని ఆయన పేర్కొన్నారు.
కడ్తాల్: గ్రీన్‌ఫీల్డ్ ట్రిపుల్‌ఆర్ రోడ్డు భూ నిర్వాసితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ మండల పరిధిలోని పలు గ్రామాల రైతులు మంగళవారం హైదరాబాద్‌లో మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావును కలిశారు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రం అందజేశారు. ఆయా రోడ్ల నిర్మాణంతో భూములు కోల్పోవడంతో పాటు రైతులకు కలిగే ఇబ్బందులను వివరించారు. అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో సింగిల్‌విండో డైరెక్టర్ జోగు వీరయ్య, మాజీ ఉప సర్పంచ్ ముత్యాలు, నాయకులు భిక్షపతి, వంశీ, లక్ష్మణ్, నర్సింహ తదితరులు ఉన్నారు.
ఇబ్రహీంపట్నం రూరల్: టీజీఐఐసీకి భూములు కోల్పోయిన అర్హులైన రైతులందరికీ ఇంటి స్థలాలు ఇస్తామని ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అంనతరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని ఎల్మినేడులో మంగళవారం భూ సేకరణ, రెవెన్యూ, టీజీఐఐసీ అధికారులు పర్యటించారు. పంచాయతీ కార్యాలయంలో రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భూ పరిరక్షణ సమితి, ఇతర రాజకీయ పార్టీల నాయకులు వేర్వేరుగా ఆర్డీఓకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం వద్ద అర్హుల జాబితా ఉందని స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. ప్రభుత్వం చేసిన ఎంజాయ్‌మెంట్ సర్వే ఆధారంగా త్వరలోనే లే ఔట్ చేసి ప్లాట్లు అప్పగించేలా చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు.