
ఆ పార్టీలవి కుట్ర రాజకీయాలు
ఆమనగల్లు: రాష్ట్రంలో విపక్ష పార్టీలైన బీఆర్‌ఎస్, బీజేపీలు కుట్ర రాజకీయాలు సాగిస్తున్నాయని నాగర్‌కర్నూల్ ఎంపీ డా.మల్లురవి ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఆమనగల్లు పట్టణంలో సీఎస్‌ఆర్ నిధులు రూ.4 కోట్లతో నిర్మిస్తున్న బీసీ బాలుర వసతిగృహం నిర్మాణ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తున్నట్టు తెలిపారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నట్టు చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తోందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గుర్రం కేశవులు, పీసీసీ కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర చెంచు యువజన సంఘం అధ్యక్షుడు మండ్లి రాములు, పార్టీ పట్టణ అధ్యక్షుడు మాణయ్య పాల్గొన్నారు.
నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లురవి