
పోలీసులకు సవాల్‌గా దోపిడీ ఘటన
అబ్దుల్లాపూర్‌మెట్: మండల కేంద్రంలో ఉన్న బ్రిలియంట్ ఇంజనీరింగ్ కళాశాలలో రూ.1.07 కోట్లు దోపిడీకి పాల్పడిన దొంగలను పట్టుకునేందుకు పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఇటీవల అర్ధరాత్రి కళాఽశాల కార్యాలయంలోకి ప్రవేశించిన దోపిడీ దొంగలు ఎలాంటి ఆధారాలు దొరక్కుండా చోరీ చేసి పోలీసులకు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఇంత పెద్ద మొత్తంలో దోపిడీకి పాల్పడిన దుండుగులు పాత నేరస్తులై ఉండొచ్చని, వివరాలను సేకరించే పనిలో పడ్డారు. నగదు దోపిడీకి పాల్పడడంతో పాటు సీసీ కెమెరాల డీవీఆర్‌లను అపహరించడాన్ని పరిశీలిస్తే దొంగతనాల్లో ఆరితేరిన వారై ఉంటారని భావిస్తున్నారు. కళాశాల పరిసరాలతో పాటు జాతీయ రహదారి సమీపంలో ఉన్న వివిధ సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం.