
బీసీ డిక్లరేషన్ అమలు చేయాలి
షాబాద్: అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి సభలో కాంగ్రెస్ అగ్రనాయకులు బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో సోమవారం రెండోరోజు రిలే దీక్షలకు హాజరైన ఆయన మాట్లాడుతూ.. 40 ఏళ్లుగా బీసీలకు అన్యాయం చేస్తూ అణగదొక్కుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జనాభాలో అధిక శాతం ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు న్యాయమైన వాటా అని, ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపాలన్నారు. 42 శాతం రిజర్వేషన్లు వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీసీ రిజర్వేషన్ సాధన సమితి సభ్యులు జడల రాజేందర్‌గౌడ్, రాపోల్ నర్సింహులు, తమ్మలి రవీందర్, మాణెయ్య, రమేష్, దర్శన్, శేఖర్, కృష్ణ, రఘువరన్, నారాయణ, దీక్షలో రాము, వెంకటేశ్‌గౌడ్, రాములు, మల్లయ్య, మల్లేష్ తదితరులు ఉన్నారు.