బైక్‌ను ఢీకొట్టిన బస్సు | - | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొట్టిన బస్సు

Oct 14 2025 8:51 AM | Updated on Oct 14 2025 8:51 AM

బైక్‌

బైక్‌ను ఢీకొట్టిన బస్సు

ముగ్గురికి తీవ్ర గాయాలు

కొత్తూరు: ముందు వెళ్తున్న బైక్‌ను గుర్తు తెలియని బస్సు ఢీకొట్టడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కొత్తూరు పట్టణంలోని పెంజర్ల కూడలి జాతీయ రహదారిపై సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. దేవరకద్ర మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన నవీన్‌(40), మల్లేష్‌(45) అన్నదమ్ములు. వీరు కొన్నేళ్ల నుంచి రాజేంద్రనగర్‌ సమీపంలోని కాటేదన్‌లో ఉంటున్నారు. ఆదివారం తమ స్వగ్రామంలో ఓ శుభకార్యం ఉండడంతో ఇద్దరితో పాటు మల్లేష్‌ కుమారుడు లోకేష్‌(12) బైక్‌పై వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ముగ్గురు బైక్‌పై బయలుదేరగా పట్టణంలోని పెంజర్ల కూడలి వద్దకు రాగానే వెనకాల నుంచి వచ్చిన గుర్తు తెలియని బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో ఉస్మానియాకు తరలించారు.

హత్య కేసులో నిందితురాలి అరెస్టు

14 రోజుల రిమాండ్‌ తరలింపు

కేశంపేట: భర్తను హత్య చేసిన ఘటనలో నిందితురాలైన భార్యను కేశంపేట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ నరహరి కథనం ప్రకారం.. మండలం కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన కొప్పు కుమార్‌(35) రోజూ మద్యం తాగి భార్య మాధవిని వేధిస్తుండేవాడు. ఈ నెల 11న రాత్రి సైతం మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. భర్తను ఎలాగైనా అంతం చేయాలని భావించిన మాధవి అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో అతని తల, ఛాతిపై సిమెంట్‌ ఇటుకతో బలంగా మోదింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఆమె మృతదేహాన్ని బయటికి ఈడ్చుకుంటూ వచ్చి ఇంటి ముందు ఉన్న నీటి సంపులో పడేసినట్లు తెలిపారు. ఇంట్లో ఉన్న రక్తం మరకలను తుడిచి, పౌడర్‌ను చల్లి ఆధారాలు దొరకుండా చేసి పరారైనట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై మృతుడి సోదరుడు జంగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాపు చేపట్టినట్లు తెలిపారు. కేశంపేట వైఎస్‌ఆర్‌ చౌరస్తా వద్ద మాధవిని సోమవారం అదుపులోకి తీసుకొని విచారించగా.. ఆమె నేరాన్ని అంగీకరించారు. ఈ మేరకు ఆమెను కోర్టులో హాజరు పర్చారు. న్యాయమూర్తి 14రోజుల రిమాండ్‌ విధించినట్లు సీఐ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కడ్తాల్‌: గుర్తుతెలియని కారు– బైకు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. సీఐ గంగాధర్‌ తెలిపిన వివరాలు.. మండల కేంద్రానికి చెందిన జల్కం శేఖర్‌(36) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం పొలం పనులు ముగించుకుని, తన ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తుండగా, శ్రీలక్ష్మి వెంచర్‌లోని మెకానిక్‌ షాపు సమీపంలో గుర్తు తెలియని కారు ఢీకొట్టింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తీవ్ర గాయాలపాలైన శేఖర్‌ను 108 వాహనంలో మహేశ్వరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య శివలీల, కూతురు, కుమారుడు ఉన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

కన్న కొడుకుకు తల్లి తలకొరివి

కందుకూరు: అనారోగ్యంతో మరణించిన కొడుకుకు తల్లి తలకొరివి పెట్టిన విషాద ఘటన మండల పరిధిలోని నేదునూరులో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గంగుల నాగభూషణ్‌రెడ్డి, బాలమణికి దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. నాగభూషణ్‌రెడ్డి ఇరవై ఏళ్ల క్రితం మృతి చెందగా, ఐదేళ్ల క్రితం చిన్న కూతురు చనిపోయింది. పెద్ద కూతురుకు వివాహం చేసి అత్తవారింటికి పంపగా, కొడుకు భాస్కర్‌రెడ్డి (30)తో కలిసి వ్యవసాయ పనులు చేసుకుంటూ గ్రామంలోనే నివసిస్తున్నారు. కొద్ది రోజులుగా అనారోగ్యం బారిన పడిన కొడుకు సోమవారం ఉదయం మరణించాడు. దీంతో తల్లి బాలమణి తలకొరివి పెట్టి, అంతిమ సంస్కారాలు పూర్తి చేసింది.

బైక్‌ను ఢీకొట్టిన బస్సు 1
1/3

బైక్‌ను ఢీకొట్టిన బస్సు

బైక్‌ను ఢీకొట్టిన బస్సు 2
2/3

బైక్‌ను ఢీకొట్టిన బస్సు

బైక్‌ను ఢీకొట్టిన బస్సు 3
3/3

బైక్‌ను ఢీకొట్టిన బస్సు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement