
కారు–ఆటో ఢీ.. భార్యాభర్తలకు గాయాలు
ఆమనగల్లు: ఆటోను కారు ఢీకొట్టిన ప్రమాదంలో ఓ దంపతులు తీవ్రంగా గాయపడిన సంఘటన తలకొండపల్లి మండలం చుక్కాపూర్ గ్రామశివారులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన భార్యాభర్తలు అశోక్‌రెడ్డి, సుమతమ్మ సోమవారం సమీపంలోని తమ వ్యవసాయ పొలంలో పచ్చిగడ్డి కోసుకుని ఆటోలో గ్రా మా నికి వస్తుండగా ఆమనగల్లు నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ఆ టో కొద్ది దూరం వెళ్లి పల్టీ కొట్టడంతో దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గుర్తించిన గ్రామస్తులు వెంటనే ఇరువురిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యా ప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
చికిత్స పొందుతూ ఆర్టీసీ డ్రైవర్ మృతి
ఇబ్రహీంపట్నం రూరల్: ఆదిబట్ల మున్సిపల్ పరిధిలోని రాందాస్‌పల్లికి చెందిన కంతి కిషన్ (50) సోమవారం ఉదయం మృతిచెందాడు. ఇబ్రహీంపట్నం డిపోలో విధులు నిర్వర్తిస్తున్న కిషన్‌కు రెండు రోజుల క్రితం గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేర్చించగా, చికిత్స పొందుతూ చనిపోయాడు. బీఆర్‌ఎస్ నాయకు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, కొప్పు జంగయ్య తదితరులు మృతదేహం వద్ద నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ప్రైవేటు హాస్టల్‌లో యువకుడి ఆత్మహత్య
● ల్యాండ్ సర్వేయర్‌గా పనిచేస్తున్న మృతుడు
● ఆర్థిక ఇబ్బందులే కారణమని అనుమానం
పహాడీషరీఫ్: ప్రైవేటు హాస్టల్‌లో ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం చేసుకుంది. ఎస్‌ఐ దయాకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు మండలం చంద్రవంశ గ్రామానికి చెందిన కిష్టప్ప కుమారుడు భానుప్రసాద్(25) కందుకూరు మండలం రాచులూ ర్‌లోని ఓ వెంచర్‌లో కొద్ది రోజులుగా ల్యాండ్ సర్వేయర్‌గా పనిచేస్తూ, తుక్కుగూడలోని సాయిబాలాజీ హాస్టల్‌లో మరో నలుగురు యువకులతో కలిసి నివాసం ఉంటున్నాడు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు హాస్టల్‌కు చేరుకున్న భానుప్రసాద్ రూమ్‌మేట్లు బయటికి వెళ్లిన సమయంలో తలుపులు వేసుకొని దుప్పటితో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాయంత్రం వరకూ తలుపులు తెరువకపోవడంతో స్నేహితులు వచ్చి, తలుపులు నెట్టి చూడగా ఉరేసుకొని కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా అనంతరం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. తన తండ్రి గొంతుకు గడ్డలు అయ్యాయని, తాను పనిచేసే చోట డబ్బులు అడ్వాన్స్‌గా తీసుకొని చికిత్స చేయిస్తానని.. కొన్ని అప్పులు కూడా ఉన్నట్లు రూమ్‌లో ఉండే తమతో చెప్పేవాడని స్నేహితులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఫిలింనగర్‌లో రూ.లక్ష నగదు పట్టివేత
బంజారాహిల్స్: ఫిలింనగర్‌లోని అపర్ణ సి నార్ వ్యాలీ చౌరస్తాలో ఆదివారం అర్ధరాత్రి ఓ యువకుడి బైక్‌ను ఆపి తనిఖీలు చేయగా బ్యా గ్‌లో రూ.లక్ష తీసుకెళ్తూ పట్టుబడ్డాడు. ట్రిఫు ల్ ఎస్ వైన్‌షాపులో క్యాషియర్‌గా పనిచేస్తున్న భాస్కర్ షాపు మూసివేసిన అనంతరం ఆ రో జు కలెక్షన్‌ను తీసుకెళ్తున్నట్లుగా వెల్లడించాడు.