ఆర్‌ఎస్‌ఎస్‌ రూట్‌ మార్చ్‌ | - | Sakshi
Sakshi News home page

ఆర్‌ఎస్‌ఎస్‌ రూట్‌ మార్చ్‌

Oct 13 2025 9:06 AM | Updated on Oct 13 2025 9:06 AM

ఆర్‌ఎస్‌ఎస్‌ రూట్‌ మార్చ్‌

ఆర్‌ఎస్‌ఎస్‌ రూట్‌ మార్చ్‌

మొయినాబాద్‌: ఆర్‌ఎస్‌ఎస్‌ శతాబ్ధి ఉత్సవాల సందర్భంగా ఆదివారం మొయినాబాద్‌లో పథ సంచాలన్‌(రూట్‌ మార్చ్‌) చేపట్టారు. వందలాది మంది ఆర్‌ఎస్‌ఎస్‌ కర సేవకులు భరత మాత, హెగ్డేవార్‌, గోల్వాల్కర్‌ చిత్రపటాలతో మొయినాబాద్‌ మున్సిపల్‌ కేంద్రంలో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా మమత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ శంకర్‌పల్లి ఖండ కార్యవాహ చేకుర్త నాగిరెడ్డి మాట్లాడుతూ.. డాక్టర్‌ హెగ్డేవార్‌ ఆశయాలే స్ఫూర్తిగా హిందూ సమాజం మరింత శక్తివంతమయ్యే దిశగా స్వయం సేవకులు పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం, నాయకులు ప్రభాకర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, గణేశ్‌, మహేందర్‌, సాయితేజ, సత్యనారాయణ, ప్రసాద్‌రెడ్డి, దశరథ్‌రెడ్డి, సుశాంత్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement