
రైతులకు వరం ‘పీఎం ధన్‌ధాన్య’
ఈవీఎంల గోడౌన్ పరిశీలన రాజేంద్రనగర్‌లోని ఈవీఎంల గోడౌన్‌ను శనివారం జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చంద్రారెడ్డి సందర్శించారు.
ఇబ్రహీంపట్నం రూరల్: పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకం రైతులు ఆర్థికంగా ఎదగడానికి ఎందో దోహదపడుతుందని జిల్లా వ్యవసాయాధికారి ఉష తెలిపారు. ప్రధానమంత్రి ధన్–ధాన్య కృషి యోజన పథకం, పప్పు ధాన్యాల మిషన్‌ను ప్రధాని నరేంద్రమోదీ శనివారం వర్చువల్ ద్వారా ప్రారంభించారు. జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో ప్రారంభ కార్యక్రమాన్ని జిల్లా వ్యవసాయాధికారి, వివిధ మండలాల నుంచి దాదాపుగా 200 మంది రైతులు, కేవీకే సెంటర్, క్రిడా తరఫున శాస్త్రావేత్తలు, డివిజన్ ఏడీఏలు, మండల వ్యవసాయాధికారులు, విస్తరణ అధికారులు వీక్షించారు. ఈ సందర్భంగా ఉష మాట్లాడుతూ.. ఈ పథకం ఆరేళ్ల పాటు కొనసాగుతుందని తెలిపారు. వ్యవసాయ రంగం తక్కువ ఉత్పాదకత, తగినంత హామీ లేని నీటి పారుదల, పరిమిత రుణ లభ్యత, పంట కోత తర్వాత మౌలిక సదుపాయలు లేకపోవడం వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. వ్యవసాయ సామర్థ్యం సమృద్ధిగా ఉన్నప్పటికీ ఉత్పాదకత, ఆర్థికాభివృద్ధి పరంగా వెనుకబడిన అనేక జిల్లాల్లో ఈ సవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయని, ఈ అంతరాలను పరిష్కరించాల్సిన అవసరాన్ని గుర్తించి కేంద్రం 2025 బడ్జెట్‌లో పీఎం ధన్‌ధాన్య కృషి యోజన కింద 100 ఆకాంక్షాత్మక వ్యవసాయ జిల్లాలను అభివృద్ధి చేస్తామని ప్రకటించిందన్నారు. కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్త విజయ్‌కుమార్, చిత్తాపూర్ గ్రామ రైతు అన్నపూర్ణ ప్రకృతి వ్యవసాయంలో తన అనుభాలను తోటి రైతులతో పంచుకున్నారు.
జిల్లా వ్యవసాయాధికారి ఉష