
ఆస్పత్రికి వెళ్లిన మహిళ అదృశ్యం
చేవెళ్ల: ఆస్పత్రికి వెళ్లొస్తానని చెప్పి వెళ్లిన ఓ మహిళ అదృశ్యం అయింది. ఈ సంఘటన దేవునిఎర్రవల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అరుంధతి(46) శుక్రవారం ఉదయం ఇంటి నుంచి చేవెళ్లలోని హాస్పిటల్‌కు వెళ్లింది. సాయంత్రం అయినా తిరిగి రాలేదు. ఆమె పోన్ స్విచ్ఛాఫ్ అయింది. రాత్రి వరకు చుట్టుపక్కల, చేవెళ్లలో, తెలిసిన వారిని, బంధువుల వద్ద ఆరా తీసినా ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో అరుందతి తమ్ముడు దయాకర్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.