
తైక్వాండోలో జాతీయ స్థాయికి ఎంపిక
నిజామాబాద్ నాగారం: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి అండర్–14 ఎస్‌జీఎఫ్ తైక్వాండో టోర్నీ శనివారం ముగిసింది. జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యదర్శి నాగమణి ఆధ్వర్యంలో బాలబాలికలకు వివిధ కేటగిరీల్లో పోటీలు నిర్వహించారు. ప్రతిభ చూపిన క్రీడాకారులకు బంగారు, రజత, కాంస్య పతకాలు అందించారు. పోటీల్లో మనస్విని (నిజామాబాద్), జునేరియా కుల్‌సమ్ (నల్లగొండ), సమన్విత (రంగారెడ్డి), కతిజాఫాతిమా (నిజామాబాద్), మగేశ్ మెహరిన్ (రంగారెడ్డి), హారిక (రంగారెడ్డి), సమీక్ష (రంగారెడ్డి), టి.వైష్ణవి(హైదరాబాద్) బంగారు పతకాలు సాధించి జాతీయస్థాయికి ఎంపికయ్యారు. వీరు ఈ నెల 28 నుంచి నాగాలాండ్‌లో నిర్వహించే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు నాగమణి పేర్కొన్నారు. పోటీలను ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఈశ్వర్, పరిశీలకుడు రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.