
ఈవీఎంల గోడౌన్ పరిశీలన
రాజేంద్రనగర్: రాజేంద్రనగర్‌లోని ఈవీఎంల గోడౌన్‌ను శనివారం జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చంద్రారెడ్డి సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన నిర్వహించారు. ఈవీఎం గోడౌన్‌కు వేసిన సీళ్లను పరిశీలించి బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లు, ఇతర ఎన్నికల సామగ్రిని భద్రపరిచిన తీరును తనిఖీ చేశారు. ఈవీఎంల గోడౌన్ వద్ద పోలీసు బందోబస్తును పరిశీలించారు. రాజేంద్రనగర్ తహసీల్దార్, వేర్ హౌస్ ఇన్‌చార్జి రాములు, ఎన్నికల విభాగం అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.