
బీసీలకు న్యాయం జరిగే దాకా పోరాటం
షాబాద్: బీసీలకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని బీసీ సేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ అన్నారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంపై శుక్రవారం మండల కేంద్రంలో బీసీ సేన ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. దుకాణాలు బంద్ చేయించారు. అనంతరం ముంబై–బెంగళూరు లింకు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బర్క కృష్ణ మాట్లాడుతూ.. బీసీలకు రిజర్వేషన్ల విషయంలో తీరని అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీలను అణగదొక్కుతూ, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగొద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలుచేసేదాక పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు వెంకట్‌యాదవ్, రవీందర్, బీసీ సేన మండల అధ్యక్షుడు దయాకర్‌చారి, ఉపాధ్యక్షుడు బాలరాజ్, యూత్ అధ్యక్షుడు అజయ్‌కుమార్, నాయకులు రాపోలు నర్సింహులు, చంద్రయ్య, సత్యం, చెన్నయ్య, మల్లేష్, మహేందర్, విఠలయ్య, శ్రీశైలం, నారాయణ, రాఘవచారి, స్వామి, గోపాల్, కుమ్మరి శ్రీను, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
బీసీసేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ