
మహాసభలను విజయవంతం చేయాలి
మొయినాబాద్: తుర్కయంజాల్‌లో ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించే మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అల్లి దేవేందర్ పిలుపునిచ్చారు. మున్సిపల్ కార్యాలయం వద్ద గురువారం వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై మహాసభల్లో చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని అన్నారు. జిల్లాలోని మున్సిపల్ కార్మికులంతా పెద్ద ఎత్తున తరలివచ్చి మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మొయినాబాద్ మున్సిపల్ వర్కర్ యూనియన్ గౌరవ అధ్యక్షడు రత్నం, అధ్యక్షుడు సుధాకర్, ప్రధాన కార్యదర్శి సురేష్, ఉపాధ్యక్షులు ప్రవీణ్, నర్సింహ, కార్మికులు పాల్గొన్నారు.