
జాతీయ సదస్సులో అధ్యాపకుడి ప్రజెంటేషన్
షాద్‌నగర్: తమిళనాడులోని సెంట్రల్ యూనివర్సిటీలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ స్పాన్సర్‌షిప్‌తో నిర్వహిస్తున్న జాతీయ సదస్సుకు గురువారం షాద్‌నగర్‌కు చెందిన అర్థశాస్త్ర అధ్యాపకుడు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సామ రవీందర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా క్లైమేట్ చేంజ్ అండ్ ఎనర్జీ ఫర్ వికసిత్ భారత్ –2047 అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. వాతావరణంలో మార్పులతో దేశంలో ఆర్థిక వ్యవస్థ ఏవిధంగా ప్రభావితం అవుతుందని అనే అంశాన్ని వివరించారు.