
మహిళా సంఘాలు మెప్మాకు అనుసంధానం
చేవెళ్ల: గ్రామాల్లో ఇన్నాళ్లుగా కొనసాగిన మహిళా సంఘాలు అన్ని మున్సిపాలిటీ పరిధిలోని మెప్మా పరిధిలో పని చేస్తాయని జిల్లా పీడీ వెంకట నారాయణ తెలిపారు. చేవెళ్ల మున్సిపాలిటీ కార్యాలయంలో కమిషనర్ వెంకటేశం ఆధ్వర్యంలో బుధవారం మహిళా సంఘాల గ్రూప్ రిసోర్స్ పర్సన్‌లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ వెంకటనారాయణ, డీఎంసీ(డిస్ట్రిక్ మిషన్ కోఆర్డినేటర్) ఇందిరా మాట్లాడుతూ.. మహిళా సంఘాలు అన్ని మున్సిపాలిటీ పరిధిలో ఉండే మెప్మా సంస్థ పరిధిలోకి వస్తాయని చెప్పారు. చేవెళ్ల మున్సిపాలిటీగా ఇటీవలే ఏర్పడటంతో మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చే గ్రామాల్లో ఉన్న మహిళా సంఘాలు అన్ని మెప్మాకు అనుసంధానం అయినట్లు పేర్కొన్నారు. మహిళా సంఘాలకు బ్యాంకు రుణాలు, ఉపాధి శిక్షణ, ఆరోగ్య కార్యక్రమాలు, సంయుక్త నిధులు తదితర కార్యక్రమాలు అమలు చేస్తామన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు మున్సిపాలిటీలలో మెప్మా సభ్యులకు అందుతాయని వివరించారు. సమావేశంలో మున్సిపాలిటీ పరిధిలోని మహిళా సంఘాల గ్రూప్ రిసోర్స్ పర్సన్‌లు, సభ్యులు పాల్గొన్నారు.