
ప్రజలు కేసీఆర్ పాలన కోరుకుంటున్నారు
యాచారం: ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. యాచారం గ్రామంలోని ఎస్సీ కాలనీలో బుధవారం ఉదయం మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ కాంగ్రెస్ బాకీ కార్డులు పంచారు. ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలను కూడా సకాలంలో నిర్వహించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. కాంగ్రెస్ మోసాలు ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయని, అభివృద్ధి, సంక్షేమం కావాలంటే కేసీఆర్ రావాలనే ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మద్దతుదారులే విజయం సాధిస్తారని ధీమా వ్యక్తంచేశారు. అనంతరం ఓ ఫంక్షన్ హాల్‌లో కార్యకర్తల సమా వేశం నిర్వహించారు. రెండేళ్ల తర్వాత జరిగే సాధారణ ఎన్నికలకు ప్రస్తుత స్థానిక ఎన్నికలు ప్రీఫైనల్‌గా భావించాలన్నారు. అత్యధిక స్థానాల్లో విజయం సాధించి, ఎంపీపీ, జెడ్పీ పీఠాలను కై వ సం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్‌గౌడ్, యాచారం మాజీ సర్పంచ్ మారోజ్ కళమ్మ, నాయకులు యాదయ్యగౌడ్, జోగు అంజయ్య, చింతుల్ల సాయిలు, బూడిద రాంరెడ్డి పాల్గొన్నారు.
ఆరు గ్యారంటీల అమలుపై చేతులెత్తేసిన ప్రభుత్వం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థుల విజయం ఖాయం
మార్నింగ్ వాక్‌లో
మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి