
ఈ గుర్తులు దేనికి సంకేతం?
కొందుర్గు: అసలే ఓ వైపు రీజినల్ రింగ్ రోడ్డు, మరోవైపు రేడియల్ రోడ్డు వెళుతున్నాయనే ప్రచారంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఉన్న కొద్దిపాటి పొలం రోడ్డులో పోతే ఎలా బతకాలని మనోవేదనకు గురవుతున్నారు. ఈ సమయంలో మండలంలోని ముట్పూర్ శివారులో రామచంద్రాపూర్ నుంచి రేగడిచిల్కమర్రి వెళ్లే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా దాదాపు 150 ఫీట్ల దూరంలో పసుపుపచ్చని రంగుతో రాతిబండలపై ఈపీఓ ఎ5 అని గుర్తులు పెట్టారు. ఇవి ఎవరు పెట్టారో.. ఎందుకు పెట్టారో తెలియక స్థానికులు అయోమయానికి గురవుతున్నారు. ఈ విషయమై పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్ అధికారులను వివరణ కోరగా తమకు తెలియదని చెప్పడంతో గ్రామస్తులు టెన్షన్ పడుతున్నారు.