
సీజేఐపై దాడికి యత్నం అమానుషం
ఇబ్రహీంపట్నం: విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు అన్ని సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించే కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ జోనల్ స్థాయి టోర్నమెంట్‌ను మంగళవారం పట్టణ సమీపంలోని గురుకుల విద్యాపీఠం్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో క్రీడలకు ప్రోత్సాహం కరువైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపారు. క్రీడాకారుల కోసం స్టేడియం నిర్మించేందుకు ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని కలెక్టర్‌కు సూచించారు. అవసరమైతే సొంత డబ్బులు వెచ్చించి క్రీడకారులకు సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కంబాలపల్లి గురునాథ్‌రెడ్డి, వైస్ చైర్మన్ కరుణాకర్, పీఏసీఎస్ చైర్మన్ పాండు రంగారెడ్డి, ఎస్‌జీటీ జోనల్ సెక్రటరీ సుశీల, నాయకులు ఈసీ శేఖర్‌గౌడ్, నీళ్ల భాను, ప్రశాంత్‌కుమార్, వెంకటేశ్వర్లు, కొంగర విష్ణువర్థన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం: దేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై దాడి యత్నాన్ని నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం ఇబ్రహీంపట్నంలో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి పి.యాదయ్య, రాష్ట్ర కమిటీ సభ్యుడు రమణ, జిల్లా సభ్యుడు సామేల్ మాట్లాడుతూ.. మతోన్మాదంతో న్యాయవాది రాకేశ్ కిషోర్ తన బూట్‌ను న్యాయమూర్తి గవాయ్‌పై విసిరిన ఘటనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. న్యాయవాది రాకేశ్‌ను వెంటనే అరెస్టు చేయాలని.. ఈ దాడిని ప్రతిఒక్కరూ ఖండించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఈ.నర్సింహ, జి.నర్సింహ, ప్రకాశ్‌కారత్, బుగ్గరాములు, ఎల్లేష్, యాదగిరి, యాదయ్య, సుధాకర్, వీరేశం, వంశీ, శ్రీకాంత్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి

సీజేఐపై దాడికి యత్నం అమానుషం