
ప్రమాదవశాత్తు రికార్డ్స్ దగ్ధం
కడ్తాల్: మండల పరిధిలోని మైసిగండి బాలుర గిరిజన ఆశ్రమ పాఠశాలలోని ఓ గదిలో భద్రపరిచిన రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు సంబంధించిన స్కాలర్‌షిప్ మాన్యువల్ ఆన్‌లైన్‌స్పైరల్ బాండింగ్ హార్డ్ కాపీస్ మంగళవారం ఉదయం ప్రమాదవశాత్తు దగ్ధమయ్యాయి. 1982 నుంచి 2015 వరకు సంబంధించిన హార్డ్ కాపీస్, ఫైల్స్ మైసిగండి ఆశ్రమ పాఠశాలలోని ఓ గదిలో భద్ర పర్చారు. మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో ప్రమాదవశాత్తు గదిలో భద్ర పరిచిన రికార్డులు దగ్ధమయ్యాయి. గమనించిన పాఠశాల సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సీఐ గంగాధర్, ఎస్‌ఐ చంద్రశేఖర్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. వసతిగృహ సంక్షేమాఽధికారి బాలరాజు పిర్యాధు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్టు సీఐ గంగాధర్ తెలిపారు.