
ఇబ్రహీంపట్నంలో భారీ వర్షం
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం ప్రాంతంలో మంగళవారం విరామం లేకుండా సుమారు రెండు గంటల పాటు భారీ వర్షం కురిసింది. సాయంత్రం 5.30 నుంచి 7. 30 గంటల వరకు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇబ్రహీంపట్నంలో 39 మి.మీ, ఎలిమినేడులో 27.3, మంగల్‌పల్లిలో 22, కొంగరకలాన్‌లో 11.3, తుర్క యంజాల్‌లో 27, అబ్దుల్లాపూర్‌మెట్‌లో 26 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది.