
ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన అవసరం
కడ్తాల్: విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంపొందించుకోవాలని శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ నాగభూషణం అన్నారు. మండల కేంద్రంలోని బాలుర ఉ న్నత పాఠశాల విద్యార్థులకు మంగళవారం ట్రాఫిక్, రోడ్డు భద్రత నియమాలపై అవగా హన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైనర్‌లు వాహ నా లు నడపొద్దని సూచించారు. పిల్లలకు తల్లిదండ్రులు వాహనాలు ఇస్తే చట్టపరమైన చర్య లు తీసుకోవడం జరుగుతుందన్నారు. లైసెన్స్‌లేకుండా వాహనాలు నడపొద్దని, ద్విచక్రవాహనాలను హెల్మెట్ లేకుండా, కారును సీట్‌బెల్ట్ ధరించకుండా నడపరాదని తెలిపారు. మద్యం తాగి, సెల్‌ఫోన్ మాట్లా డుతూ వాహనాలు నడపొద్దని, ఎడమ చేతి వైపు నడవడం తదితర ట్రాఫిక్ నియమా లను వివరించారు. కార్యక్రమంలో షాద్‌నగర్ ట్రాఫిక్ సీఐ చంద్రశేఖర్, పాఠశాల హెచ్‌్‌ఎం రాధాకృష్ణారెడ్డి పాల్గొన్నారు.