
మెట్రో కిటకిట
సాక్షి, సిటీబ్యూరో: రపయాణికుల రాకపోకలతో సోమవారం మెట్రోరైళ్లు కిటకిటలాడాయి. దసరా సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లిన ప్రయాణికులు తిరిగి చేరుకోవడంతో వివిధ ప్రాంతాల్లో మెట్రోస్టేషన్లలో రద్దీ నెలకొంది. విజయవాడ వైపు నుంచి చేరుకున్నవాళ్లు ఎల్‌బీనగర్ మెట్రోస్టేషన్ నుంచి నగరంలోని పలు ప్రాంతాలకు బయలుదేరారు. ఎల్‌బీనగర్ మెట్రో వద్ద ఉదయం నుంచి మధ్యా హ్నం వరకు ప్రయాణికుల సందడి నెలకొంది. నాగోల్, ఉప్పల్, సికింద్రాబాద్ ఈస్ట్, అమీర్‌పేట్, రాయదుర్గం, లక్డీకాపూల్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, మియాపూర్ తదితర స్టేషన్ల వద్ద ప్రయాణికుల రద్దీ పెరిగింది. మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి నగరానికి చేరుకున్న రైళ్లతో సికింద్రాబాద్, చర్లపల్లి, నాంపల్లి, లింగంపల్లి స్టేషన్‌లలో సందడి కనిపించింది. సొంత వాహనాల్లోనూ జనం పెద్ద ఎత్తున సిటీకి చేరుకున్నారు. విజయవాడ, వరంగల్, కరీంనగర్ తదితర ప్రధాన రహదారుల్లోని శివారు ప్రాంతాల్లో రద్దీ కారణంగా వాహనాలు స్తంభించాయి.