
సంపులో పడి..చిన్నారి మృతి
కొందుర్గు: సంపులో పడి చిన్నారి మృతిచెందిన ఘటన జిల్లేడ్ చౌదరిగూడ మండలం చేగిరెడ్డి ఘనాపూర్‌లో చోటుచేసుకుంది. చౌదరిగూడ ఎస్‌ఐ విజయ్ కుమార్ తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన శిరీషకు ఎనిమిదేళ్ల క్రితం మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం కొల్లూరుకు చెందిన శ్రీనుతో వివాహమైంది. వీరికి ముగ్గురు కూతుళ్లు. రెండు నెలల క్రితం భర్తతో గొడవపడిన శిరీష పిల్లలను తీసుకొని పుట్టింటికి వచ్చింది. ఈ క్రమంలో సోమవారం ఆమె ఇద్దరు కూతుళ్లను తన పెద్దమ్మ యాదమ్మ ఉంచి పెద్ద కూతురు అనారోగ్యంతో ఉండడంతో ఆస్పత్రికి తీసుకెళ్లింది. తిరిగి వచ్చేసరికి చిన్న కూతురు ధన్షిక (13 నెలలు) కనిపించలేదు. ఇంటి ఎదుట నీటిసంపులో చూడగా మృతదేహం తేలియాడుతూ కనిపించింది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వాహనాల బ్యాటరీలు చోరీ
మణికొండ: కాలనీల్లోని ఖాళీ స్థలాల్లో నిలిపిన వాహనాల బ్యాటరీలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. మున్సిపల్ పరిధి లోని శ్రీరాంనగర్ కాలనీలో రెండు రోజులు గా కాలనీలోని ఖాళీ స్థలాల్లో టాటా ఏస్, డీ సీఎం వాహనాలకు పూజలు చేసి నిలిపి ఉంచారు. సోమవారం ఉదయం చూసే సరికి వాటి బ్యాటరీలను దొంగిలించారని బాధితు లు గుర్తించారు. చేసిన సీసీ కెమెరాలు సరిగా పనిచేయకపోవటంతో వారిని గుర్తించేందుకు వీలు పడటం లేదని, సీసీ కెమెరాలకు మరమ్మతులు చేయించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. బ్యాటరీ దొంగలపై నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశామని వాహనదారులు తెలిపారు.