
స్పెషల్ వెబ్‌పోర్టల్ ఏర్పాటు చేయండి
ఇబ్రహీంపట్నం రూరల్: లేఅవుట్లు, ప్లాట్ల రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖల సమన్వయ లోపంతో భూ యజమానులు, ప్లాట్ల యజమానులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని బీఆర్‌ఆర్ పౌండేషన్ చైర్మన్, ఉప్పరిగూడ మాజీ సర్పంచ్ బూడిద రాంరెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాసి సెక్రటేరియెట్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా రాంరెడ్డి మాట్లాడుతూ.. పంచాయతీ లేఅవుట్లు, జీహెచ్‌ఎంసీలో పరిధిలో లే అవుట్ల ద్వారా, సేల్‌డీడ్‌ల ద్వారా నాలా కన్వెర్షెన్, రెవెన్యూ రికార్డుల్లో మ్యూటేషన్లు చేయకుండా ప్లాట్లు విక్రయించారన్నారు. ధరణి తప్పిదాలు పునరావృతం కాకుండా భూభారతిలో లోపాలు సరి చేసి భవిష్యత్‌లో ఆస్తి హక్కులపై వివాదాలు రాకుండా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. ప్లాట్లు, భూముల వివరాలను నమోదు చేసి సరైన వెబ్ పోర్టల్ ఏర్పాటు చేయాలన్నారు.
బీఆర్‌ఆర్ ఫౌండేషన్ చైర్మన్ రాంరెడ్డి