
భర్త మృతి.. కొడుకు కటకటాల్లోకి
షాబాద్: తాగిన మైకంలో తల్లితో గొడవ పడుతున్న తండ్రిని పక్కకు తోసేయడంతో ఆయన మృత్యువాత పడ్డాడు. ఓ వైపు భర్త మరణం.. మరోవైపు ఆయన మృతికి కారణమైన కొడుకు జైలుకు వెళ్లడంతో ఆ తల్లికి పుట్టెడు దుఖం మిగిలింది. ఈ ఘటన షాబాద్ ఠాణా పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. సీఐ కాంతారెడ్డి తెలిపిన ప్రకారం.. మండల పధిలోని దామర్లపల్లి గ్రామానికి చెందిన సదానందం(65) మద్యం సేవించి భార్య సుజాతతో గొడవపడుతున్నాడు. ఈ క్రమంలో కుమారుడు రమేశ్ తల్లిదండ్రులను వారించేందుకు వెళ్లగా తండ్రి దాడికి యత్నించాడు. దీంతో రమేశ్ తండ్రి సదానందంను తొసేయడంతో కుప్పకూలాడు. వెంటనే షాద్‌నగర్ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. తండ్రి మృతికి కారణమైన వ్యక్తి రమేశ్‌ను సోమవారం రిమాండ్‌కు తరలించారు.

భర్త మృతి.. కొడుకు కటకటాల్లోకి