
ట్రిపుల్‌ఆర్ అలైన్‌మెంట్ మార్చేలా చూడండి
షాద్‌నగర్: రీజినల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను మార్చేలా చూడాలని కోరుతూ మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణకు పలువురు రైతులు విన్నవించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో కొందుర్గు మండలం తంగెళ్లపల్లి, ఆగిర్యాల, చెరుకుపల్లి, గంగన్నగూడ, కేశంపేట మండలం తొమ్మిదిరేకుల, లింగంధన, నిర్దవెల్లి, ఫరూఖ్‌నగర్ మండలం చించోడ్, ఉప్పరిగడ్డ, భీమారం, చౌదరిగూడ మండలం తూంపల్లి, వనంపల్లి, తుమ్మలపల్లి గ్రామాలకు చెందిన పలువురు రైతులు శనివారం మహబూబ్‌నగర్ వెళ్లి ఎంపీని కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ట్రిపుల్ ఆర్ రోడ్డు తమ గ్రామాల మీదుగా వెళ్తోందని, రోడ్డు నిర్మిస్తే తమకున్న కొద్ది పాటి వ్యవసాయ భూములు కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేసే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీని కలిసిన వారిలో చిట్టెం లక్ష్మీకాంత్‌రెడ్డి, నర్సింహ యాదవ్, ఇస్నాతి శ్రీనివాస్, బల్వంత్‌రెడ్డి, సుధాకర్ అప్ప, నరేందర్‌రెడ్డి, అశోక్, అనిల్‌కుమార్, యుగంధర్, బాలరాజు తదితరులు ఉన్నారు.