
యూరియా.. ఎన్నాళ్లీ కష్టాలయా
షాబాద్: రోజులు గడుస్తున్నా రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. మండల కేంద్రంలోని రైతు వేదిక వద్దకు సోమవారం రైతులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. చెప్పులు క్యూ లైన్‌లో ఉంచి నిరీక్షించారు. 800 మంది రైతులకు ఒక్కో బస్తా చొప్పున అందజేశారు. యూరియా అందని రైతులు అధికా రులను నిలదీశారు. దీంతో ఒకటిరెండు రోజుల్లో తెప్పిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఉసూరుమంటూ వెనుదిరిగారు.
తరలివచ్చి.. క్యూ కట్టి
శంకర్‌పల్లి: పట్టణంలోని వ్యవసాయ సహకార సంఘం వద్ద సోమవారం యూరియా పంపిణీ చేయగా రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారిని లైన్లో నిల్చోబెట్టి, వచ్చిన ప్రతి ఒక్కరికి రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు. అవసరానికి అనుగుణంగా తెప్పించాలని అన్నదాతలుకోరుతున్నారు.
ఒక్కొక్కరికి రెండు బస్తాల చొప్పున..
చేవెళ్ల: మండలంలోని ఆలూరు పీఏసీఎస్‌కు సోమ వారం 480 బస్తాలు, మనగ్రోమోర్ కేంద్రానికి 480 బస్తాల యూరియా వచ్చింది. చుట్టుపక్కల గ్రామా ల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో రావడంతో గందరోగళం ఏర్పడింది. దీంతో పోలీసులు వారిని లైన్ లో నిలబెట్టి ఒక్కో రైతుకు రెండు బస్తాలచొప్పున పంపిణీ చేశారు.

యూరియా.. ఎన్నాళ్లీ కష్టాలయా