ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజావాణిలో ప్రజలు సమర్పించిన ఫిర్యాదులకు సత్వరమే పరిష్కారం చూపించే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలని అదనపు కలెక్టర్ (లోకల్ బా డీస్) శ్రీనివాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో నేరుగా ప్రజల నుంచి డీఆర్‌ఓ సంగీతతో కలిసి అర్జీలు స్వీకరించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. ఈ వారం 33 అర్జీ లు వచ్చాయని తెలిపారు. ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 25, ఇతర శాఖలవి 8 ఉన్నాయన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, మండల తహసీల్దారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.
నేడు డయల్ యువర్ డీఎం
షాద్‌నగర్‌రూరల్: ఆర్టీసీ ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు మంగళవారం డయల్ యువర్ డీఎం కార్య క్రమం నిర్వహిస్తున్నట్లు షాద్‌నగర్ డిపో మేనేజర్ ఉష సోమవారం ఒక ప్రకటనలో పేర్కొ న్నారు. ఉదయం 11 నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు ప్రయాణికులు తమ సమస్య లు, సూచనలు, సలహాలను తెలియజేయాలని కోరారు. 99592 26287 నంబర్‌లో సంప్రదించాలని ఆమె సూచించారు.
ప్రతీ శిశువుకు పోలియో చుక్కలు వేయించాలి
ఇబ్రహీంపట్నం రూరల్: పుట్టిన ప్రతి శిశువుకు పోలియో చుక్కలు వేయించాలని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం జిల్లాస్థాయి పల్స్ పోలియో టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్‌రావు మాట్లాడుతూ.. జిల్లాలో ఐదేళ్ల లోపు 4.90 లక్షల మంది పిల్లలు ఉన్నట్లు గుర్తించామన్నారు. అక్టోబర్ 12న పోలియో బూత్‌ల్లో, 13 నుంచి 15వ తేదీ వరకు ఇంటింటికీ వెళ్లి ఆశ వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. పాఠశాలల పిల్లలు, ఇతర ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసి మహమ్మారిని తరిమికొట్టాన్నారు. సమావేశంలో వైద్యాధికారులు పాల్గొన్నారు.
అంగన్‌వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించండి
షాద్‌నగర్: అంగన్‌వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎన్.రాజు డిమాండ్ చేశారు. తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఎమ్మెల్యేకు వినతిపత్రంసమర్పించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన ప్రకారం అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. పనికి తగిన వేతనం ఇవ్యాలని, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలు చెల్లించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సీబీఈ బకాయిలు ఇవ్వాలని కోరారు. ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని, సీనియార్టీ ప్రకారం ఇంక్రిమెంట్లు నిర్ణయించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రీను నాయక్, ఈశ్వర్ నాయక్, అంగన్‌వాడీలు పాల్గొన్నారు.
ప్రజావాణి అర్జీలను సత్వరం పరిష్కరించాలి
ప్రజావాణి అర్జీలను సత్వరం పరిష్కరించాలి