
జీపీఓలు బాధ్యతగా పనిచేయాలి
క్లస్టర్ల వారీగా వివరాలు
అబ్దుల్లాపూర్‌మెట్: గ్రామాల్లోని ప్రభుత్వ భూములను పరిరక్షించడంలో జీపీఓలు (గ్రామ పాలన ఆఫీసర్లు) బాధ్యతాయుతంగా పనిచేయాలని అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి సూచించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నియమించిన జీపీఓలకు సోమవారం అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని గ్రామాల్లో క్లస్టర్ల వారీగా బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు 19 మంది జీపీఓలు తమ నియామక పత్రాలను తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డికి అందజేసి విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీపీఓలు తమకు కేటాయించిన గ్రామాల్లోని ప్రభుత్వ భూములు, సీలింగ్ భూములు, భూధాన్‌భూములు అన్యాక్రాంతం కాకుండా నిత్యం పర్యవేక్షిస్తుండాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పఽథకాలను ప్రజలకు వివరిస్తూ రెవెన్యూ శాఖకు మంచిపేరు తీసుకురావాలన్నారు. ప్రజలకున్న రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా విధులు నిర్వహించి ప్రభుత్వం, ప్రజల మన్ననలను పొందాలని సూచిస్తూ విధుల్లో చేరిన జీపీఓలను అభినందించారు. మండలంలో మొత్తం 22 క్లస్లరు ఉండగా మంగళవారం నుంచి 19 క్లసర్లలో జీపీఓలు విధులు నిర్వహిస్తారని వెల్లడించారు.
క్లస్టర్ జీపీఓ
కోహెడ మణిమాల
లష్కర్‌గూడ శైలజ
పెద్ద అంబర్‌పేట–2 స్వాతి
పెద్ద అంబర్‌పేట–1 మంజుల
తుర్కయంజాల్–1 హన్మంత్
తుర్కయంజాల్–2 శివలీల
తట్టిఅన్నారం శరత్‌చంద్ర
పసుమాముల దయానంద్
కవాడిపల్లి అంజయ్య
తారమతిపేట తిరుమలయ్య
ఉమర్‌ఖాన్‌దాయర కృష్ణ
అబ్దుల్లాపూర్–1 కవిత
అబ్దుల్లాపూర్–2 రాకేశ్
గౌరెల్లి కవితారాణి
తొర్రూర్ నర్సింహరాజు
అనాజ్‌పూర్ రీనాకుమారి
కుంట్లూర్–1 అఫ్జల్
ఇంజాపూర్ సుప్రియ
బాటసింగారం వెంకటరత్నం
ప్రభుత్వ భూములను పరిరక్షించండి
అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి
నేటి నుంచి 19 క్లస్టర్లలో ఆఫీసర్ల విధులు