
పోక్సో కేసుల తగ్గింపునకు కృషి
తాండూరు టౌన్: పెరుగుతున్న పోక్సో కేసులను తగ్గించేందుకు అందరూ కలిసి కట్టుగా కృషి చేయాలని తాండూరు పట్టణ ఎస్‌ఐ పుష్పలత అన్నారు. సోమవారం షీ టీం ఆధ్వర్యంలో స్థానిక సెయింట్ మార్క్స్ పాఠశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. విద్యార్థినులకు పోక్సో చట్టం, మానవ అక్రమ రవాణా, బాల్యవివాహాలు, సైబర్ క్రైమ్‌లపై అవగాహన కల్పించారు. వేధింపులకు గురైన సమయంలో స్పందించాల్సిన వివరాలను తెలిపారు. అనంతరం ఎస్‌ఐ మాట్లాడుతూ.. బాలికలు, మహిళలు ఎలాంటి వేధింపులకు గురైనా వెంటనే షీ టీంకు లేదా 100 నంబర్‌కు డయల్ చేయాలన్నారు. 18 ఏళ్ల లోపు బాలికలను లైంగికంగా వేధిస్తే, వారిపై పోక్సో కేసు నమోదవుతుందన్నారు. బాలికలకు చట్టాలు, పోలీసు, న్యాయ వ్యవస్థ గురించారు. కార్యక్రమంలో జిల్లా కళాజాత బృందం ఇన్‌చార్జి అశోక్, తాండూరు షీటీం ఇన్‌చార్జి శేఖర్, పాఠశాల ప్రిన్సిపాల్ ఆరోగ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌ఐ పుష్పలత