
ఆ ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయండి
మహేశ్వరం: మహేశ్వరం మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకుని తక్షణమే సస్పెండ్ చేయలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ప్రణయ్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన విద్యార్థి సంఘం నాయకులతో కలిసి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పూర్ణచందర్, జిల్లా రెవెన్యూ అధికారి సంగీతకు వినతిపత్రం అందజేశారు. మహేశ్వరం మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గోపి అమ్మ ఆదర్శ పాఠశాల నిధులు దుర్వినియోగం చేస్తున్నాడని ఆరోపించారు. పాఠశాలలో 825 మంది విద్యార్థులకుగాను ప్రభుత్వం స్కావెంజర్ల జీతాల కోసం 2024 ఆగస్టు నుంచి రూ.20వేల చొప్పున విడుదల చేస్తోందని ఇద్దరు స్కావెంజర్లు నియమించి రూ.10వేల చొప్పున జీతం ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.7 వేల చొప్పున ఇచ్చి రూ.6 వేలు పక్కదారి పట్టించారని వివరించారు. సమయపాలన పాటించడం లేదన్నారు. మధ్యాహ్న భోజనంలోనూ రిజిస్ట్రర్‌లో పేర్లు రాసి నిధులు దోచుకుంటున్నారన్నారు. స్కావెంజర్ల జీతాల గోల్‌మాల్, మధ్యాహ్న భోజన బిల్లుల అవకతవకల్లో పాఠశాల ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి పాత్ర ఉందని ఆరోపణలు వస్తున్నాయని.. సదరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగి బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణ లు సైతం ఉన్నాయని విద్యాశాఖ అధికారులు స మగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కో రారు. లేదంటే విద్యార్థి సంఘాలను కలుపుకొని పె ద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇందుకు అధికారులు సానకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు తరంగ్, జిల్లా కమిటీ సభ్యులు సిద్దు, తరుణ్, రాహుల్, కిరణ్, భరత్, జస్వంత్ తదితరులు పాల్గొన్నారు.
స్కావెంజర్ల జీతాల గోల్‌మాల్, మధ్యాహ్న భోజన బిల్లుల అవకతవకలపై విచారణ జరపాలి
ప్రజావాణిలో అధికారులను కోరిన ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ప్రణయ్