
కార్మికుల సమస్యలు పరిష్కరించండి
కడ్తాల్: తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మధ్యాహ్న భోజన కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు స్వప్న డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికుల మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.10 వేతనం చెల్లించాలని కోరారు. ఆరు నెలలుగా వంట గ్యాస్, కోడిగుడ్ల బిల్లులు, వేతనం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వెంటనే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం మధ్యాహ్న భోజన కార్మిక సంఘం నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా బుజ్జమ్మ, గౌరవ అధ్యక్షురాలిగా లక్ష్మమ్మ, ఉపాధ్యక్షురాలుగా బాలమణి, అలివేలు, సభ్యులుగా తదితరులు నియమితులయ్యారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ పెంటయ్య, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా సహకార్యదర్శి పద్మ, కార్మిక సంఘం మండల అధ్యక్షురాలు రజియాభేగం తదితరులు పాల్గొన్నారు.
మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు స్వప్న

కార్మికుల సమస్యలు పరిష్కరించండి