
బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్
సాక్షి, రంగారెడ్డిజిల్లా: జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా కె.చంద్రారెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు కొంగర సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్‌కు చేరుకున్న ఆయనకు ఏఓ సునిల్‌కుమార్ స్వాగతం పలికి పరిచయం చేసుకున్నారు. గతంలో ఇక్కడ అదనపు కలెక్టర్‌గా పని చేసిన ఎంవీ భూపాల్ రెడ్డి ఏసీబీ కేసులో అరెస్ట్ కావడం తెలిసిందే. అప్పటి నుంచి ఆ స్థానంలో అదనపు (స్థానిక సంస్థలు) కలెక్టర్ ప్రతిమా సింగ్ ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం విధితమే. ప్రస్తుతం ప్రతిమా సింగ్ మెటర్నిటీ సెలవులో వెళ్లడంతో ప్రభుత్వం హెచ్‌ఎండీఎ బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు ఓఎస్డీగా పని చేస్తున్న కె.చంద్రా రెడ్డిని అదనపు కలెక్టర్‌గా బదిలీ చేసింది. ఈ మేరకు ఆయన బాధ్యతలు స్వీకరించారు.
నేటినుంచి పాలిటెక్నిక్
కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు
మహేశ్వరం: మహేశ్వరం ప్రభుత్వ పాలిటెక్నినిక్ కళాశాలలో ఈ నెల 5 నుంచి 10వ తేది వరకు స్పాట్ అడ్మిషన్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ నాగరాజు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ కోర్సుల్లో మొత్తం 45 సీట్లు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. పదో తరగతి పాసైన వారు, పాలిటెక్నినిక్ అర్హత పరీక్ష రాసిన వారు సర్టిఫికెట్లతో కళాశాలలో ఉదయం 9.45 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సంప్రదించాలన్నారు. ఈ నెల 11న మూడు కోర్సులకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్టు చెప్పారు. వివరాలకు 94901 20175 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
మహిళా శక్తి భవనాలు
మంజూరు చేయండి
షాద్‌నగర్: నియోజకవర్గంలో మహిళా శక్తి భవనాలను మంజూరు చేయాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కోరారు. ఈ మేరకు సోమవారంహైదరాబాద్‌లోని సెర్ప్ కార్యాలయానికి వెళ్లిన ఆయన సీఈఓ దివ్యను కలిసి వినతిపత్రం అందజేశారు.ఫరూఖ్‌నగర్, చౌదరిగూడ, నందిగామ మండలాల్లో మహిళా శక్తి భవనాలు నిర్మించేందుకు ఒక్కో భవనానికి కోటి రూపాయల చొప్పున మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు చేయండి
విద్యుత్ సమస్యల పరిష్కారానికి ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు, వైర్లు మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే మంత్రి భట్టి విక్రమార్కకు వినతి పత్రం అందజేశారు. నియోజకవర్గానికి మొత్తం 79 ట్రాన్స్‌ఫార్మర్లు, 32,300 మీటర్ల కండక్టర్, 74వేల మీటర్ల కేబుల్, విద్యుత్ స్తంభాలు 798 మంజూరు చేయాలని కోరారు.
ఫార్మా భూ సర్వేకు
సహకరించాలి
యాచారం: ఫార్మాసిటీకి పరిహారం అందజేసి సేకరించిన భూముల సర్వేకు రైతులు సహకరించాలని మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి అన్నారు. మండల పరిధిలోని నక్కర్తమేడిపల్లిలో అధికారులు చేపట్టిన రైతుల కబ్జా భూముల సర్వేను సోమవారం ఆమె పరిశీలించారు. సర్వేలో ఏమైనా అభ్యంతరాలుంటే అధికారులకు వినతిపత్రాలు అందజేయాలని సూచించారు. డీసీపీ వెంట ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, గ్రీన్ ఫార్మాసిటీ సీఐ సత్యనారాయణ ఉన్నారు. కాగా, తాడిపర్తిలో ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్‌రెడ్డి పర్యటించారు. గ్రామంలోని కొందరు రైతులు పట్టా భూములు ఇవ్వడానికి ముందుకు రాగా వాటిని పరిశీలించారు. ఫార్మా భూముల సర్వే లో అభ్యంతరాలుంటే యాచారం తహసీల్దార్ అయ్యప్పకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్

బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్