ద్విచక్ర వాహనాల దొంగకు రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

ద్విచక్ర వాహనాల దొంగకు రిమాండ్‌

Aug 6 2025 8:17 AM | Updated on Aug 6 2025 8:23 AM

ద్విచక్ర వాహనాల దొంగకు రిమాండ్‌

ద్విచక్ర వాహనాల దొంగకు రిమాండ్‌

షాద్‌నగర్‌రూరల్‌: బైక్‌ చోరీలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని రిమాండ్‌కు తరలించామని ఏసీపీ లక్ష్మీనారాయణ తెలిపారు. మంగళవారం పట్టణంలోని ఠాణాలో సీఐ విజయ్‌కుమార్‌ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ లక్ష్మీనారాయణ కేసు వివరాలు వెల్లడించారు. మండల పరిధిలోని చెరుకుపల్లికి చెందిన నర్సింలు జూన్‌ 19న ద్విచక్రవాహనంపై షాద్‌నగర్‌కు వచ్చాడు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ఉన్న కొరియర్‌ కార్యాలయం పక్కన తన బైక్‌ పార్క్‌ చేసి వెళ్లాడు. మరునాడు వచ్చి చూడగా కనిపించలేదు. దీంతో ఆయన షాద్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో భాగంగా సాంకేతిక నైపుణ్యంతో కొత్తూరు మండలం ఇన్ముల్‌నర్వకు చెందిన కొర్రా వినోద్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా బైక్‌ చోరీ చేసినట్లు అంగీకరించాడని తెలిపారు.

నాలుగు బైక్‌లు స్వాధీనం

నిందితుడిపై ఇప్పటికే షాద్‌నగర్‌ ఠాణా పరిధిలో నాలుగు, ఆర్‌జీఐ పీఎస్‌ పరిధిలో ఒకటి, కొత్తూరు పరిధిలో నాలుగు, అప్జల్‌గంజ్‌ పీఎస్‌ పరిధిలో రెండు కేసులు నమోదై జైలు వెళ్లి వచ్చినట్లు వెల్లడించారు. నిందితుడి నుండి రూ.2 లక్షల విలువ చేసే బైక్‌లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించామన్నారు. కేసును ఛేదించిన పట్టణ సీఐ విజయ్‌కుమార్‌, డీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ శివారెడ్డి, సిబ్బంది రవీందర్‌, సంతోశ్‌, కర్ణాకర్‌, జాకీర్‌, రాజు చాకచక్యంగా వ్యవహరించినట్లు తెలిపారు.

ఇద్దరు చైన్‌ స్నాచర్లకు..

ఇబ్రహీంపట్నం: ఇద్దరు చైన్‌ స్నాచర్లను ఇబ్రహీంపట్నం పోలీసులు అరెస్టు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. తలకొండపల్లికి చెందిన సంఘీ నాగరాజు(25) అల్మాస్‌గూడలో నివసిస్తూ ఆమెజాన్‌ కంపెనీలో ప్యాకింగ్‌ బాయ్‌గా పనిచేస్తున్నాడు. 2023లో ఓ రేప్‌ కేసులో జైల్‌కు వెళ్లి వచ్చాడు. షార్ట్‌ ఫిల్మ్‌లు తీస్తున్న నాగరాజుకు నెల రోజుల క్రితం జడ్చర్లకు చెందిన వేదవ్యాస్‌ (24)తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి ఒకే రూంలో ఉంటున్నారు. వ్యసనాలకు బానిసలైన వీరు ఇరువురూ సులువుగా డబ్బు సంపాదించేందుకు చైన్‌ స్నాచింగ్‌ బాటపట్టారు. ఈ నెల 1వ తేదీన పోల్కంపల్లి పంచాయతీ పరిధిలోని జాజోనిబావికి చెందిన లావణ్య(33) తమ పొలంలో పశువులను మేపుతుండగా నాగరాజు, వేదవ్యాస్‌ బైక్‌పై వచ్చి ఆమె మెడలోంచి పుస్తెల తాడును అపహరించేందుకు యత్నించారు. సదరు మహిళ అప్రమత్తమై గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల రైతులు వచ్చారు. అప్రమత్తమైన దుండగులు వెంటనే పుస్తెలతాడును వదిలి పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ పుటేజీలను పరిశీలిస్తున్న క్రమంలో మంగళవారం మంగళ్‌పల్లి వద్ద చైన్‌ స్నాచింగ్‌ కోసం యత్నిస్తూ పోలీసులకు చిక్కారు. చైన్‌స్నాచింగ్‌కు వాడిన వేదవ్యాస్‌ ఆర్‌15 బైక్‌ను సీజ్‌ చేసి నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

నాలుగు బైక్‌లు స్వాధీనం

వివరాలు వెల్లడించిన ఏసీపీ లక్ష్మీనారాయణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement