
జయశంకర్‌కు ఘన నివాళి
చిన్నారుల ఆరోగ్యానికి.. చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ విజయలక్ష్మి అన్నారు.
8లోu
ఇబ్రహీంపట్నం రూరల్: తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై పోరాడి, ఉద్యమానికి ఊపిరి పోసింది ప్రొఫెసర్ జయశంకర్ అని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 91వ జయంతి ఉత్సవాలను బుధవారం కలెక్టరేట్‌లోని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆచార్య జయశంకర్‌పాత్ర మరువలేనిదని తెలిపారు. ఉద్యమానికి వెన్నెముకగా నిలిచారని, స్వరాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆయన అడుగు జాడల్లో నడవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, కలెక్టరేట్ ఏఓ సునీల్ కుమార్, బీసీ వెల్ఫేర్ అధికారి కేశురాం, వెనుకబడిన సంఘాల నాయకుడు మల్లేష్ యాదవ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
నిర్లక్ష్యాన్ని సహించేది లేదు
డబుల్ బెడ్రూం ఇళ్ల పెండింగ్ పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. సంబంధిత అధికారులతో బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు, పెండింగ్ పనులపై సమీక్షలు నిర్వహించాలని సూచించారు. లబ్ధిదారులకు కేటాయింపు విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. విద్యుత్ సరఫరా, నీటి సరఫరా సంపుల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. పెండింగ్ పనులు పూర్తి చేసి 15 రోజుల్లో లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించాలని, లేని పక్షంలో బాధ్యులైన వారిపై చర్యలుంటాయని హెచ్చరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో హౌసింగ్, విద్యుత్, అర్‌డబ్ల్యూఎస్, ఆర్డీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.