
మోసం!
గురువారం శ్రీ 7 శ్రీ ఆగస్టు శ్రీ 2025
తూకం..
‘సొమ్ము’ చేసుకుంటున్న వ్యాపారులు
● ఫిర్యాదు చేసినా స్పందన శూన్యం ● పట్టించుకోని తూనికలు, కొలతల అధికారులు ● జిల్లాలో గత ఏడాది 275 కేసులు ● ఈ ఏడాది ఇప్పటి వరకు 98 నమోదు
ఇదింతే.. అడగొద్దు..
8లోu
సాక్షి, రంగారెడ్డిజిల్లా: వినియోగదారులు అవసరాన్ని, అమాయకత్వాన్ని కొంత మంది వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో 349 పెట్రోల్ బంకులు ఉండగా, వందకుపైగా వేబ్రిడ్జ్‌లు ఉన్నాయి. నిత్యావసరాలు విక్రయించే కిరాణాలు, సూపర్ మార్కెట్లు మొదలు.. చికెన్, మటన్ దుకాణాలు, రైతుబజార్లు, ప్రధాన రోడ్లకు ఇరువైపులా తోపుడు బండ్లపై విక్రయించే కూరగాయలు, పండ్ల తూకాల్లోనూ భారీ మోసాలకు పాల్పడుతున్నారు. కొనుగోలుదారులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆయా షాపుల్లో తనిఖీలు నిర్వహించి తక్కెడ, బాట్ల తూకాలను పరిశీలించాల్సిన తూనికలు కొలతలశాఖ పరోక్షంగా వారికి సహకరిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. 2024లో జిల్లా వ్యాప్తంగా 275 కేసులు నమోదు చేయగా, 2025లో ఇప్పటి వరకు 98 కేసులను మాత్రమే నమోదు చేయడం ఈ శాఖ అధికారుల అలసత్వానికి అద్దం పడుతోంది. తూకాల్లో మోసాలపై ఎవరైనా వినియోగదారులు ఫిర్యాదు చేసినా సకాలంలో స్పందించడం లేదు. 27 మండలాలు, 526 రెవెన్యూ గ్రామాలు, 15 మున్సిపాలిటీలు, మూడు మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్న జిల్లాకు కేవలం ముగ్గురే అధికారులు ఉండటం కూడా తక్కువ కేసులు నమోదు కావడానికి మరో కారణమనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
న్యూస్‌రీల్
ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి 200 గజాల ఖాళీ స్థలంలో ఇల్లు నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. తెల్లవారు జామునే చంపాపేట ఇసుక లారీల అడ్డాకు చేరుకున్నాడు. నచ్చిన ఇసుకను మాట్లాడుకుని ఆ పక్కనే ఉన్న ఓ వే బ్రిడ్జ్‌లో తూకం వేయించాడు. ఇసుక బరువు 32 టన్నులు ఉన్నట్లు బిల్లు జారీ చేశారు. అనుమానం వచ్చి మార్గమధ్యలో ఉన్న మరో వేబ్రిడ్జ్‌లో తూకం వేయించగా 28 టన్నులే వచ్చింది.
ఓ ద్విచక్రవాహనదారుడు జెడ్పీరోడ్డులోని ఓ పెట్రోల్‌బంకులో పెట్రోలు కొట్టించాడు. ట్యాంక్ నిండా పెట్రోలు పోయించినప్పటికీ.. ఎంతకీ ఇంజన్ స్టార్ట్ కాకపోవడంతో అనుమానం వచ్చి చెక్ చేయగా బైక్‌లో పోసింది పెట్రోల్ కాదని, నీళ్లు అని తేలింది.
ఎల్బీనగర్‌కు చెందిన ఓ గృహిణి నిత్యావసరాల కొనుగోలు కోసం సమీపంలోని ఓ మార్ట్‌కు వెళ్లింది. ర్యాక్‌లో ఓ వరుసలో సర్దిపెట్టిన పప్పులు, ఉప్మారవ్వ, చక్కర, గోధుమపిండి (ప్యాకెట్లు కేజీల్లో) సహా ఇతర వస్తువులు బిల్లింగ్ చేయించింది. ఇంటికి వెళ్లిన తర్వాత అనుమానం వచ్చి తూకం వేయగా ఒక్కో ప్యాకెట్‌లో 100 గ్రాములు తక్కువ ఉండటాన్ని చూసి విస్తుపోయింది.
ప్రశ్నిస్తే వాగ్వాదం
ఇంటి నిర్మాణం కోసం రెండు రోజుల క్రితం బాలాపూర్‌లోని ఓ ప్రైవేటు డంప్ నుంచి ఇసుక కొనుగోలు చేశాను. వాహనం ట్రక్కు నిండా ఇసుక నింపి స్థానికంగా ఉన్న ఓ వేబ్రిడ్జిలో తూకం వేయగా 12 టన్నులు ఉన్నట్లు చూపించింది. అనుమానం వచ్చి మరోచోట తూకం వేయగా రెండు టన్నుల వ్యత్యాసం చూపించింది. అదేమని ప్రశ్నిస్తే వాగ్వాదానికి దిగుతున్నారు.
– రవీంద్రాచారి, రియల్టర్
ఫిర్యాదు చేసినా పట్టింపు లేదు
మార్గమధ్యలో పెట్రోల్ ఖాళీ కావడంతో పక్కనే ఉన్న ఓ బంక్‌కు వెళ్లి కొట్టించాను. బైక్ స్టార్ట్ చేసి తీరా అర కిలోమీటర్‌కు వెళ్లిన తర్వాత ఆగిపోయింది. అనుమానం వచ్చి చూడగా పెట్రోల్ నీళ్లలా ఉంది. బంక్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే తమ తప్పేమీ లేదని, కంపెనీ నుంచే ఇలా వచ్చిందని బుకాయించారు. విజిలెన్స్, తూనికలు కొలతలశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.
– తిరుమలేష్, ద్విచక్రవాహనదారుడు

మోసం!