
నేడు డయల్ యువర్ డీఎం
షాద్‌నగర్‌రూరల్: ఆర్టీసీ ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు గురువారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు షాద్‌నగర్ డిపో మేనేజర్ ఉష బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రయాణికులు తమ సమస్యలు, సూచనలు, సలహాలను తెలియజేయాలని తెలిపారు. 99592 26287 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
సమాచార హక్కుచట్టం సరిగ్గా అమలు చేయాలి
కొందుర్గు: ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం సరిగ్గా అమలు కావడం లేదని రాష్ట్ర సమాచార కమిషనర్ దేశాల భూపాల్ అన్నారు. కొందుర్గు తహసీల్దార్ కార్యాలయాన్ని బుధవారం ఆయన సందర్శించారు. సమాచార హక్కు చట్టం అమలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ .. కొందుర్గు తహసీల్దార్ కార్యాలయంలో సిటిజన్‌చార్ట్ సరిగ్గా లేదని, 1, 2 రిజిస్టర్లు నిర్వహించడం లేదన్నారు. అప్పిలేట్ అధికారి బదిలీ అయి నెలలు గడస్తున్నా ఆమె పేరే చార్ట్‌పై ఉండటం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. మూడు నెలలుగా రాష్ట్రంలోని మెదక్, భ్రదాద్రి కొత్తగూడెం, ఖమ్మం తదితర జిల్లాల్లో పర్యటించినట్టు తెలిపారు. సమాచార హక్కు చట్టంపై సరైన చర్యలు తీసుకోవాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.
ఆమనగల్లు ఠాణాలో
రికార్డుల తనిఖీ
ఆమనగల్లు: పట్టణంలోని పోలీస్ స్టేషన్‌ను బుధవారం షాద్‌నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా పోలీసు స్టేషన్ ఆవరణను పరిశీలించిన అనంతరం రికార్డులను తనిఖీ చేశారు. సీఐ జానకీరామ్‌రెడ్డి, ఎస్‌ఐ వెంకటేశ్‌తో సమావేశమై పలు సూచనలు చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం సిద్ధంగా ఉండాలని సూచించారు.
ఐదు క్లినిక్‌లకు
షోకాజ్ నోటీసులు
శంకర్‌పల్లి: ఆర్‌ఎంపీ వైద్యులు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని, ఆపై ఎలాంటి వైద్య సేవలందించినా కఠిన చర్యలు తప్పవని డిప్యూటీ డీఎంహెచ్‌వో నాగేంద్రబాబు హెచ్చరించారు. పట్టణంలోని ఎనిమిది ఆర్‌ఎంపీ క్లినిక్స్‌ను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిబంధనలు పాటించని ఐదింటికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఆర్‌ఎంపీలు పూర్తి స్థాయి డాక్టర్లు కాదని, దీనిని రోగులు గమనించాలని సూచించారు. ఆస్పత్రికి వెళ్లే ముందు ఆ డాక్డర్‌కి ఉన్న అర్హతలపై ఆరా తీయాలన్నారు. తనిఖీల్లో శంకర్‌పల్లి పీహెచ్‌సీ వైద్యురాలు రేవతిరెడ్డి, సిబ్బంది మన్సూర్ తదితరులు పాల్గొన్నారు.
రక్తదానంతో ప్రాణం నిలుస్తుంది: చిరంజీవి
రాయదుర్గం: రక్తదానంతో ఒక ప్రాణం నిలుస్తుందని, నేటి యువతకు మళ్లీ మళ్లీ చెబుతున్నా.. రక్తదాతలు కావాలని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి సూచించారు. స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో నాలెడ్జి సిటీలోని ఫినిక్స్ సంస్థలో మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో చిరంజీవి మాట్లాడుతూ.. ఒక జర్నలిస్ట్ రాసిన కథనం చదివిన తర్వాత బ్లడ్‌బ్యాంక్ పెట్టాలనే ఆలోచన తనకు వచ్చిందని గుర్తు చేశారు. సినీనటులు తేజ సజ్జా, సంయుక్త, ఫినిక్స్ గ్రూప్ చైర్మన్ సురేష్ చుక్కపల్లి తదితరులు పాల్గొన్నారు.

నేడు డయల్ యువర్ డీఎం