
రిజర్వేషన్లు ఆమోదించకుంటే ఉద్యమం
కడ్తాల్:42 శాతం బీసీ రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, కార్యవర్గ సభ్యుడు కందుకూరి జగన్ డిమాండ్ చేశారు.మండల కేంద్రంలోని ఎంబీ ఏ గార్డెన్‌లో సోమవారం ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. తక్షణమే బీసీ రిజర్వేషన్లను ఆమోదించి అమలు చేయాలని లేని పక్షంలో బీసీ సామాజికవర్గాన్ని ఐకమత్యం చేసి, పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకోసం మంగళవారం ఇందిరాపార్కు వద్ద ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. బీసీ సామాజికవర్గ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ ఆమనగల్లు ఏరియా కమిటీ కన్వీనర్ శివశంకర్, నాయకులు శివగల రమేశ్, గుమ్మడి కరుమయ్య, పెంటయ్య, పోచయ్య పాల్గొన్నారు.