
బస్తీమే సవాల్.. తెల్లారితే పరార్
తల్లీపిల్లల ఆచూకీ లభ్యం తప్పిపోయిన తల్లీపిల్లల ఆచకూకీ లభ్యమైన సంఘటన కేశంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
8లోu
కేశంపేట: ‘హైడ్రా పేరుతో పేదల గుడిసెలు కూల్చేందుకు బుల్డోజర్లు వెళ్తున్నాయని, పెద్దల ఇళ్ల జోలికి ఎందుకు వెళ్లడం లేదని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తే.. బస్తీమే సవాల్ అంటాడు, తెల్లారితే పరార్ అవుతాడు’ అని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మండలంలోని వేములనర్వలో శనివారం జాగృతి కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం కాకునూరు గ్రామంలో స్థానిక మహిళలతో కలిసి పోస్టు కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని, మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలందరికీ రూ.2,500 చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఒక్కో మహిళకు 18 నెలలకు సంబంధించిన రూ.45 వేలు చెల్లించాలని కోరుతూ ఢిల్లీలోని సోనియాగాంధీ అడ్రస్‌కు పోస్టు కార్డులు పంపించారు. రైతుబంధు సా యాన్ని పెంచుతామని, రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కార్ రైతులను మోసం చేసిందని మండిపడ్డారు. రూ.2 లక్షల కోట్ల అప్పులు తెచ్చినప్పటికీ అభివృద్ధి చేయడంలో విఫలమైందని ధ్వజమెత్తారు. ఫ్రీ బస్సు ఇస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం బస్సుల సంఖ్య పెంచకుండా ఇబ్బంది పెడుతోందన్నారు. కరువుతో విలవిల్లాడిన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని తెలిపారు. ఆయన హయాంలో పాలమూరు ప్రాజెక్టు నిర్మాణం తొంభై శాతం పూర్తయిందని, కేవలం పది శాతం పనులను చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి చూపడం లేదని మండిపడ్డారు. అమ్మ ఒడి వాహనాల్లో డీజిల్ లేక తోయాల్సిన పరిస్థితి హన్వాడలో చూశామన్నారు. తమ పాటలతో ఆకట్టుకున్న కాకునూ రుకు చెందిన అక్కమ్మ, రాములమ్మ జానపద బృందాన్ని శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ గండ్ర జగదీశ్వర్‌గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ అనురాధ పర్వాత్ రెడ్డి, కాకునూర్ మాజీ సర్పంచ్ గండ్ర లక్ష్మమ్మ, మాజీ ఎంపీటీసీ రమాదేవి కోటీశ్వర్, జంగారెడ్డి, రాములు, కుమారస్వామి పాల్గొన్నారు.
ఇదీ ముఖ్యమంత్రి తీరు
జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
అభయహస్తం మేనిఫెస్టో అమలుకు పోస్టుకార్డు ఉద్యమం
సోనియాగాంధీకి లేఖలు

బస్తీమే సవాల్.. తెల్లారితే పరార్