ఆర్‌యూపీపీటీఎస్‌ జిల్లా కమిటీ నియామకం | - | Sakshi
Sakshi News home page

ఆర్‌యూపీపీటీఎస్‌ జిల్లా కమిటీ నియామకం

Jul 14 2025 4:31 AM | Updated on Jul 14 2025 4:31 AM

ఆర్‌య

ఆర్‌యూపీపీటీఎస్‌ జిల్లా కమిటీ నియామకం

షాద్‌నగర్‌ః రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్‌ (ఆర్‌యూపీపీటీఎస్‌) జిల్లా నూతన కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షురాలిగా నందిగామ మండలం నర్సప్పగూడ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తున్న అనురాధను, ప్రధాన కార్యదర్శిగా ఫరూఖ్‌నగర్‌ ఉర్దూమీడియం పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న దార్ల రాఘవేంద్రాచారిని ఎన్నుకున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగదీష్‌ తెలిపారు.

చిత్రకారులను కళాకారులుగా గుర్తించాలి

చిత్ర కళాకారుల అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకట్‌రెడ్డి

ఆమనగల్లు: చిత్రకారులను కళాకారులుగా గుర్తించాలని చిత్ర కళాకారుల అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రూపం వెంకట్‌రెడ్డి కోరారు. శనివారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో చిత్రకారులకు చేతినిండా పని ఉండేదని.. ప్రస్తుతం పనిలేక జీవనోపాధి కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో చిత్రకారులు చురుకుగా పాల్గొన్నారని, కేసులకు భయపడకుండా ఆంధ్రప్రదేశ్‌గా ఉన్న బోర్డులను చెరిపి తెలంగాణ పదం చేర్చారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రకారుల బాధలను గుర్తించి న్యాయం చేయాలని కోరా రు. ఈ సమావేశంలో చిత్రకారులు కొండల్‌, లింగంగౌడ్‌, గోపి, యాదయ్య, మల్లేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

మొక్కలతోనే

మానవాళి మనుగడ

కడ్తాల్‌: మానవాళి మనుగడకు వృక్షాలు ఎంతగానో తోడ్పతాయని, ఔషధాలతో పాటు, ప్రాణవాయువును అందిస్తాయని అఖిలాంఽఽధ్ర సాధు పరిషత్‌ అధ్యక్షుడు పరమాత్మ గిరిస్వామి, వేదపండితులు మేళ్లూరి వెంకటేశ్వరశర్మ అన్నారు. శనివారం కౌన్సిల్‌ ఫర్‌ గ్రీన్‌ రెవల్యూషన్‌ సహకారంతో మండల కేంద్రంలోని హనుమన్‌ఘడ్‌ ఆంజనేయ స్వామి ఆలయంలో మొక్కలకు ప్రత్యేక పూజలు చేశారు. పరిసరాలలో వృక్ష ప్రతిష్ఠ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన జీవనానికి చెట్లు ఎంతగానో ఉపయోగపడతాయని, అవసరమైన ఫలాలు అందిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్‌రెడ్డి, సీజీఆర్‌ చైర్‌ పర్సన్‌ లీల, సీజీఆర్‌ వ్యవస్థాపకుడు లక్ష్మారెడ్డి, సీఐ గంగాధర్‌, ఎస్‌ఐ చంద్రశేఖర్‌, నాయకులు జంగారెడ్డి, గంప రాములు, గంజి అంజయ్య, మల్లారెడ్డి, భిక్షపతి, మల్లయ్య, వెంకటేశ్‌, రఘుపతిరెడ్డి, జంగయ్య, వెంకటేశ్వర శర్మ, శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.

చెంచుల సంక్షేమానికి కృషి

అనంతగిరి: చెంచుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ అన్నారు. శనివారం వికారాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని అనంతగిరిపల్లి చెంచు కాలనీలో ప్రధానమంత్రి జన్మాన్‌ పథకం కింద నిర్మించనున్న మల్టీ పర్పస్‌ సెంటర్‌ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెంచు కాలనీల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రూ.60 లక్షల వ్యయంతో మల్టీ పర్పస్‌ సెంటర్‌ భవనా న్ని నిర్మించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌, గిరిజన సంక్షేమ శాఖ జిల్లా అధికారి కమలాకర్‌ రెడ్డి, ఆర్డీవో వాసుచంద్ర, తహసీల్దార్‌ లక్ష్మీనారాయణ, డీసీసీబీ డైరక్టర్‌ కిషన్‌ నాయక్‌, కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు మైపాల్‌ రెడ్డి, షరీఫ్‌, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ సత్యనారాయణ, మాజీ వైస్‌ చైర్మన్‌ చిగుళ్లపల్లి రమేష్‌ కుమార్‌, సీనియర్‌ నాయకులు ఎండీ హఫీజ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆర్‌యూపీపీటీఎస్‌ జిల్లా కమిటీ నియామకం 1
1/4

ఆర్‌యూపీపీటీఎస్‌ జిల్లా కమిటీ నియామకం

ఆర్‌యూపీపీటీఎస్‌ జిల్లా కమిటీ నియామకం 2
2/4

ఆర్‌యూపీపీటీఎస్‌ జిల్లా కమిటీ నియామకం

ఆర్‌యూపీపీటీఎస్‌ జిల్లా కమిటీ నియామకం 3
3/4

ఆర్‌యూపీపీటీఎస్‌ జిల్లా కమిటీ నియామకం

ఆర్‌యూపీపీటీఎస్‌ జిల్లా కమిటీ నియామకం 4
4/4

ఆర్‌యూపీపీటీఎస్‌ జిల్లా కమిటీ నియామకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement