
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
చేవెళ్ల: విద్యారంగ సమస్యలను పరిష్కరించి పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ చేవెళ్ల డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్, అరుణ్‌కుమార్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో సోమవారం కళాశాలల విద్యార్థులతో కలిసి ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడుస్తున్నా నేటికీ విద్యాశాఖ మంత్రిని నియమించకపోవటం దురదృష్టమన్నారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రూ.8,700 కోట్ల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్స్ వెంటనే విడుదల చేయాలన్నారు. గతంలోనే పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఇప్పటికై నా స్పందించకపోతే ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడికి పిలుపునిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న కళాశాలల విద్యార్థులతో చేవెళ్ల ప్రధాన రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు జోక్యం చేసుకొని విద్యార్థి సంఘం నాయకులను అరెస్ట్ చేసి ధర్నాను విరమింపజేశా రు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సమీర్, యశ్వంత్, చరణ్‌గౌడ్, చందు, తేజ, చిరంజీవి, ప్రశాంత్, ఆకాశ్, సోఫియాన్, మోసిన్, అజర్, వంశీ, సాయి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్లలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి