
ఎఫ్‌టీఎల్‌లో ఆక్రమణల తొలగింపు
హయత్‌నగర్: అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని కొహెడలోని పిట్టెల చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో వెలసిన ఆక్రమ నిర్మాణాలను మంగళవారం ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు తొలగించారు. సర్వే నంబర్ 141లోని కొంత భాగంలో చెరువు పరిధిలో ఉండగా ఎఫ్‌టీఎల్‌లోకి ప్రహరీ గోడలు వెలిశాయి. విషయం తెలుసుకున్న ఇరిగేషన్ ఏఈ వంశి ఆధ్వర్యంలో జేసీబి సహాయంతో గోడలను తొలగించారు. ఈ సందర్భంగా వంశి మాట్లాడుతూ... చెరువులు, కుంటలను రక్షించేందుకు కట్టుబడి ఉన్నామని, ఎవరైనా చెరువులను ఆక్రమించినా ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.