
ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి
షాద్‌నగర్‌రూరల్: భూమి కలిగిన ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ఉష అన్నారు. ఫరూఖ్‌నగర్ మండలం వెల్జర్లలోని రైతు వేదికలో నిర్వహిస్తున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియను గురువారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూమి ఉన్న రైతు ఫార్మర్ ఐడీని పొందేందుకు ఆధార్‌కార్డు, భూ యాజమాన్య పాస్‌పుస్తకం, ఆధార్‌కు లింకు చేయబడిన మొబైల్ నంబర్‌ను తీసుకొని సమీపంలోని వ్యవసాయ అధికారి, వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలని సూచించారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం అమలుచేసే పథకాలు వర్తిస్తాయని తెలిపారు.
నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడులు
రైతులు పంటల సాగులో నాణ్యమైన విత్తనాలను ఉపయోగిస్తే అధిక దిగుబడులను సాధించవచ్చని ఉష అన్నారు. రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీ నుంచి మండలంలోని ముగ్గురు రైతులకు 108 రకం వరి నాణ్యమై విత్తనాలను (ఫౌండేషన్ సీడ్స్) అందజేశారు. కొండన్నగూడలో రైతు వెంకట్‌రెడ్డి పొలంలో నాణ్యమైన విత్తన రకం వరి నారుమడిని ఆమె క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. నాణ్య మైన విత్తన రకం నుంచి వచ్చిన పంటతో రైతు స్వ తహాగా విత్తనాలు తయారు చేసుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో ఏడీఏ రమాదేవి, ఏఓ టెక్నికల్ అధికారిణి శోభారాణి, ఏఓ నిషాంత్‌కుమార్, ఏఈఓలు తేజ్‌కుమార్, గోవర్ధన్ పాల్గొన్నారు.
జిల్లా వ్యవసాయాధికారి ఉష