
21న పెన్షన్‌దారుల జిల్లా సదస్సు
ఆమనగల్లు: పట్టణంలో ఈనెల 21న ఎమ్మార్పీఎస్, వీహెచ్‌పీఎస్ సంయుక్త ఆధ్వర్యంలో చేయూత పెన్షన్‌దారుల జిల్లా సదస్సు నిర్వహిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉపేందర్ మాదిగ తెలిపారు. ప్రభుత్వం చేయూత పెన్షన్ మొత్తాన్ని పెంచాలని డిమాండ్ చేశారు. పట్టణంలో గురువారం నిర్వహించిన ఎమ్మార్పీఎస్, వీహెచ్‌పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగుల పెన్షన్ రూ.6 వేలు, చేయూత పెన్షన్ రూ.4 వేలకు పెంచి, అర్హులైన వారందరికీ అందించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా పెన్షన్ పెంచలేదని విమర్శించారు. పెన్షన్‌దారుల సమస్యలపై నిర్వహించే జిల్లా సదస్సుకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు నర్సింహమాదిగ, జిల్లా అధికార ప్రతినిధి పోతుగంటి కృష్ణమాదిగ, వీహెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు జంగయ్యమాదిగ తదితరులు పాల్గొన్నారు.