
ఆర్థికంగా ఎదిగితేనే అభివృద్ధి
చేవెళ్ల: మహిళలు ఆర్థిక శక్తిగా ఎదిగినప్పుడే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా మండలకేంద్రంలోని కేజీఆర్ గార్డెన్‌లో గురువారం నియోజకవర్గంలోని మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు పంపిణీ చేశారు. ఐదు మండలాలకు చెందిన 4,128 మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.4.96 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి మహిళను శక్తివంతురాలుగా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. వడ్డిలేని రుణలతో ఉపాధి మార్గాలను ఎంచుకొని ఆర్థికంగా రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం మహిళా సంఘాల సభ్యులను సన్మానించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ శ్రీలత, జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్‌లు పెంటయ్యగౌడ్, గోవిందమ్మ, పీఏసీఎస్ చైర్మన్‌లు ప్రతాప్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, ఆర్డీఓ చంద్రకళ, అడిషనల్ డీఆర్‌డీఏ జోజప్ప, డీపీఎం జయశ్రీ, తహసీల్దార్ కృష్ణయ్య, ఏపీఎం శోభారాణి తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య