
విద్యార్థుల ‘పొలం బాట’
ఇబ్రహీంపట్నం రూరల్: దేశానికి అన్నం పెట్టే అన్నదాత పడే కష్టాన్ని తెలియజెప్పడంతో పాటు పంటల సాగుపై అవగాహన కల్పించే దిశగా ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం సోమవారం విద్యార్థులు పొలంబాట పట్టించింది. వీరిని క్షేత్రస్థాయికి తీసుకెళ్లిన సిబ్బంది వరి నాటు విధానాన్ని ప్రత్యక్షంగా చూపించారు. నిత్యం పాఠశాల గదుల్లో కూర్చుని బోర్డుపై పాఠాలు వినే చిన్నారులు.. పొలంలో గంతులేస్తూ సరదాగా కొత్త పాఠం విన్నారు. స్వయంగా నారు తీసుకువచ్చి, నాటు కూడా వేశారు.
పొలంలో సందడి చేస్తున్న విద్యార్థులు